Aug 19, 2011

భారీ అంచనాలతో దూకుడు !


తెలుగుసినిమా ఇండస్ట్రీ కలక్షన్స్ స్టామినా ఇంత వుందా అని ఆశ్చర్యపరిచిన సినిమాలలో “పోకిరి” సినిమా ఒకటి. అనుమానం లేకుండా అందరూ ఏకగ్రీవంగా రియల్ ఇండస్ట్రీ హిట్ ఒప్పుకున్న సినిమా “పోకిరి”. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు సమపాళ్ళల్లో కుదిరాయి. మహేష్‌బాబు పెరఫార్మన్స్ కు పూరీ జగన్నాథ్ డైలాగ్స్ కరెక్ట్‌గా సెట్ అయ్యాయి.
ఇప్పుడు దూకుడు ట్రైలర్స్ మరియు ప్రమోషన్ చూస్తుంటే కచ్చితంగా “పోకిరి” సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేసే మూవీ లానే వుంది.
ఖలేజా సినిమాలో మహేష్‌బాబు చేసిన కొత్తరకం ఎనర్జిటిక్ నటన కొందరిని విపరీతంగా ఆకట్టుకున్నా, మాస్ పేక్షకులకు నచ్చే సబ్జక్ట్ కాకపొవడం వలన అందరికీ సరిగా రీచ్ అవ్వలేదు. ఆడియో ఫంక్షన్‌లో బ్రహ్నానందం మాటలు విన్నాక దూకుడు సినిమా ద్వారా ఎనర్జిటిక్ మహేష్‌బాబు నటనను శ్రీనువైట్ల మాస్‌‌ను ఆకట్టుకునే విధంగా మలచడంలో సఫలీకృతుడయ్యాడని అనిపిస్తుంది.
మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రిలీజ్‌కు రెడీ అవుతున్న దూకుడు సినిమాలో సమంతా కధానాయిక. నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర. సంగీతం: తమన్.
[ adapted from a2zdreams.wordpress.com ]

No comments: