Aug 20, 2011

2014 లో ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిది ?



 2014 లో ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిది ?

ఆంధ్రప్రదేశ్ లో 2014 లో అధికారం దక్కించుకునేందుకు పార్టీలన్నీ ఇప్పటినుండే సమాయత్తమవుతున్నాయి. జగన్ కాంగ్రెస్ ను  వీడేవరకు రాష్ట్రంలో తెలుగుదేశం , కాంగ్రెస్స్ ల మధ్య మాత్రమే పోటీ వుండేది. జగన్ కొత్తగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది.రాజకీయమంతా జగన్ చుట్టూ పరిభ్రమిస్తోంది. జగన్ దెబ్బకు ముందుగా మూతబడ్డ దుకాణం ప్రజారాజ్యం పార్టీ. రెండో గురి కాంగ్రేస్సా ? తెలుగు దేశమా ? అనేది చర్చనీయంగా వుంది. తెలంగాణా అంశం కీలకంగా వుంటుంది. లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా  సి.పి.ఎం ఈసారి ఏ రకమైన పొత్తుల వైఖరి తీసుకుంటుంది అనేది కూడా కీలకమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో 2014 లో అధికారం ఎవరిదనేది ఇప్పటికిపుడే చెప్పడం కష్టమే . ప్రస్తుతం ఎవరికి వారే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతి అంశాన్ని కీలకంగా తీసుకుంటూ చాపకింద కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు.

1 comment:

Anonymous said...

కలలొ కూడా చంద్రబాబు తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అధికారము లోకి రాదు . బుడ్డ ntr వస్తే మాత్రం కొద్దిగా అవకాశం ఉంటుంది. లోకేశ్ వరకు మాత్రం స్టూడియో (నారా) ను కూడా సరిగ్గా నడపలేడు కాబట్టి ఆ ఆలొచనకూడా చేయలేము . జగన్ ను అధిగమించి అధికారము లొకి రావాలంటె చాలా కష్టపడాలి.