Oct 3, 2011

మళ్ళీ తెరపైకి సూపర్ స్టార్ రజినీ కాంత్....రజనీ ‘రాణా’ అటకెక్కలేదు..



రజనీకాంత్ హీరోగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘రాణా’ చిత్రం ఆరంభమవ్వడం, ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురవ్వడంతో ఈ చిత్రం షూటింగ్‌కి బ్రేక్ పడటం తెలిసిందే. చెన్నయ్‌లో కొన్నాళ్లు చికిత్స పొందిన రజనీ అనంతరం సింగపూర్ వెళ్లారు. అక్కడ చికిత్స పూర్తయిన తర్వాత చెన్నయ్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘రాణా’ అటకెక్కిందనే వార్తలు కోలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. తన ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడీ భారీ పీరియాడికల్ ఫిలిం చేయడం కష్టమవుతుందని రజనీకాంత్ భావిస్తున్నారనే వార్త కూడా వినిపిస్తోంది. ఈ కారణంగా వేరే లైటర్ వీన్ కథను ఎన్నుకుని ఆ చిత్రంలో నటించబోతున్నారని, అది కూడా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే రూపొందనుందని సమాచారం.

కానీ ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని ‘రాణా’ చిత్రాన్ని నిర్మిస్త్తున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. అందరూ అంటున్నట్లు ‘రాణా’ అటకెక్కలేదని, నవంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ని తిరిగి ఆరంభిస్తామని కూడా సదరు సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే.. కొంతమంది ప్రచారం చేస్తున్నట్లు రజనీకాంత్ షూటింగ్‌లో పాల్గొనలేనంత బలహీనంగా లేరు. అందుకు నిదర్శనం ఆయన పాల్గొన్న ‘రా.వన్’ షూటింగ్. ఆ వివరాల్లోకి వెళితే..

కెమెరా ముందుకు ' రజనీ ':

అనారోగ్యంతో కొంతకాలంగా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మళ్లీ ముఖానికి రంగు వేసుకోనున్నారు. బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ఖాన్‌ చిత్రం రాావన్‌లో రోబో పాత్రను పోషిస్తున్నారు. గతంలో తన చిత్రం రోబోలో ఆయన చిట్టిగా నటించిన విషయం తెలిసిందే. రజనీ ఆరోగ్యం కుదుట పడడంతో షూటింగ్‌లో పాల్గోనేందుకు ఓకే చెప్పారు. ఆయన నటించాల్సిన సన్నివేశాలను డూప్‌తో షూట్‌ చేసి రజనీకి పంపించారు.

  ‘రా.వన్’లో నటించిన రజనీకాంత్
హిందీలో షారుక్ ఖాన్ నటించి, నిర్మిస్తున్న ‘రా.వన్’ చిత్రంలో రజనీకాంత్ ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారనే వార్త వచ్చింది. ఈ చిత్రంలో షారుక్, చిత్రకథానా యిక కరీనాకపూర్‌ని కాపాడే సీన్‌లో రజనీ నటిస్తారని తెలిసింది. అయితే ఇంకా రజనీ కోలుకోలేదని, అందుకని ‘రా.వన్’లో నటించరని ఓ వార్త వచ్చింది. ఈ కారణంగా రజనీ పోలికలు ఉన్న వ్యక్తితో షారుక్ ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాల నుకుంటున్నారని కూడా బాలీవుడ్ వర్గాలు అన్నాయి. కానీ ఆ వార్తను అబద్ధం చేస్తూ.. రజనీకాంత్ ఈ చిత్రంలో నటించారు.

ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ప్రకటించారు. ముంబయ్‌లోని ‘విజ్లింగ్ ఉడ్స్ స్టూడియో’లో ఈ చిత్రీకరణ జరిగిందని షారుక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ షూటింగ్ గురించి ఆయన మరింత వివరంగా చెబుతూ - ‘‘ఆదివారంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ‘రా.వన్’ చిత్రాన్ని రజనీ సార్ ఆశీర్వదించారు. ఆయన కనబర్చిన ప్రేమాభిమానాలకు కదిలిపోయాను. నా కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. ఈ షూటింగ్ బాగా జరిగింది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రజనీ సార్, ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.


ఆయన నటించడంతో ఈ చిత్రానికి ఓ పరిపూర్ణత వచ్చింది. రజనీసార్ ఈ చిత్రంలో నటించడానికి ఒక కారణం ఆయన కుమార్తె సౌందర్య. ఈ సందర్భంగా తనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ముందుగా ఈ షూటింగ్‌ని హైదరాబాద్‌లో చేయాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకుని, ముంబయిలో ప్లాన్ చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ చిత్రీకరణ జరిగిందట.

ఈ పోస్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.  - :: నేటి ప్రపంచం ::

No comments: