Sep 4, 2011


మహేష్ దూకుడు లో మహేష్ బాబు హీరో అవుతాడు కానీ సల్మాన్ హీరో ఏంటి అనుకుంటున్నారా…, అవును మరి బాలీవుడ్ సల్లూ భాయ్ ఇప్పుడు సౌత్ సినిమాల మీద ప్రత్యేకించి తెలుగు సినిమాల మీద మనసు పారేసుకున్నాడు. వరుస పెట్టి సౌత్ సినిమాలని రీమేక్ చేసి జనం మీదకి వదిలేస్తున్నాడు. ఇక తెలుగు సినిమాల సంగతికొస్తే ఏదో కంకణం కట్టుకున్నట్టే సాగుటుంది సల్మాన్ ఖాన్ సంగతి. పోకిరిని వాంటెడ్ పేరుతోనూ, రెడీని అదే పేరుతోనూ రీమేక్ చేసిన హిట్ కొట్టిన సల్మాన్ కొత్తగా రిలీజ్ అయ్యి, రిలీజ్ కావాల్సిన సినిమాలని ఒక చూపు చూస్తున్నాడు. హీరో  రామ్ కెరీర్ కు ఊపిరి పోసిన తాజా చిత్రం కందిరీగ. కొంచెం కామెడి, కొంచెం గ్లామర్ , కొంచెం మసాల కలిపి కొట్టి మొత్తానికి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సల్మాన్ ఖాన్ కి నచ్చిందట. ఇంకే రీమేక్ హక్కులు మంచి రేటు ఇచ్చి కొనేశాడు. వచ్చే సంవత్సరం ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నాడు. రిలీజ్ అయిన సినిమాలను చూసి నమ్మకం కుదిరితేనే సల్మాన్ రీమేక్ చేస్తాదనుకుంటే పొరపాటే. రిలీజ్ కు ముందే నమ్మకం కుదిరిన సినిమాల పైనా ఓ లుక్ ఇస్తున్నాడు. ఆ కోవలోనిదే మహేష్ దూకుడు. శ్రీను వైట్ల మహేష్ కాంబినేషన్ లో వస్తున్న దూకుడు సినిమా విశేషాలు సల్మాన్ ఖాన్ ను బాగా ఆకట్టుకున్నాయట. శ్రీను వైట్ల మహేష్ పై నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్ కు ముందే బాలీవుడ్ రీమేక్ రైట్స్ కొని పెట్టుకున్నాడట. అంటే దూకుడు కూడా వచ్చే సంవత్సరం బాలీవుడ్ లో సల్మాన్ హీరోగా రీమేక్ అయిపోతుందన్నమాట. ఇక్కడ మీరు ఓ విషయం గమనించారా… గతంలో సల్మాన్ రామ రెడీ, మహేష్ పోకిరి రీమేక్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ అదే హీరోల సినిమాలు, అదే జోనర్ సినిమాలు కందిరీగ, దూకుడు  రీమేక్ చేయబోతున్నాడు. ఈ రెండు విషయాలకు ఏమైనా కనక్షన్ ఉందంటారా…

No comments: