ఇదో
చిత్రవిచిత్ర విశ్వం. వింతలూ, విడ్డూరాలకు కొదవే వుండదు. ఆహారం కావాలన్నా
పైసలు కావాలి. నిరాహారం వుండాలన్నా కాసులు కావాలి. కడుపుకు తిన్నా
తినకున్నా ఖర్చు చేయాల్సిందేనా? ఇదెక్కడి చిక్కు అనిపిస్తుంది. ఎందాకో
ఎందుకు! ఒక్క పొద్దు పద్దే చూద్దాం. విచిత్రంగా పస్తు వుంటే ఖర్చు
తగ్గాల్సింది పోయి పెరుగుతుంది. మరి ఆ సాయంత్రం పళ్లూ పాలూ ఫలహారాలు
మాత్రమే పుచ్చుకుంటే అంతే కదా. ఇది సామాన్యుల సంగతి. అదే స్వామీజీలు,
మాతాజీలు, బాబాలకైతే వేల రూపాయల్లో ఖర్చవుతుంది. పాలకవర్గ పార్టీల నాయకులే
కనక నిరాహారం వుంటే అయ్యే ఖర్చు లక్షలు, కోట్లు. మరి వారి ఏర్పాట్లు
మామూలుగా వుంటాయా! దీక్ష వేదిక కోసం స్థలం బుక్ చేయాలి. ఆకాశమంత పందిరి
వేయాలి. నేలంతా పరుపులు పరవాలి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, మైకులు,
మీడియాకు మంచెలు ఎట్సెట్రా ఎట్సెట్రా కావాలి. స్టార్ ఆస్పత్రి వైద్యం
అందుబాటులో వుండాలి. పత్రికల్లో, టీవీ చానళ్లలో ఫొటోలు ఇంటర్వ్యూలు వచ్చేలా
చూసుకోవాలి. తోటి రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల
నేతలు, కార్యకర్తలు వేలాదిగా వచ్చి పరామర్శించేలా ఫిక్స్ చేయాలి. భద్రత
కోసం కంపెనీలకు కంపెనీలు బలగాలు కావాలి. ఆ పరిసరాల్లో పదే పదే ట్రాఫిక్
జామ్ గట్రా అయి వీరి దీక్ష గురించి చర్చించుకునేలా చూడాలి. పైగా
పరామర్శించడానికి వచ్చేవారి స్వాగత సత్కారాలు, సాగనంపే ఏర్పాట్లు
చూసుకోవాలి. ఇదంతా 'మామూలు' వ్యవహారమా!Sep 27, 2011
ఖరీదైన నిరాహారం

చూసుకోవాలి. ఇదంతా 'మామూలు' వ్యవహారమా!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment