ముందెన్నడూ ఏ సినిమా లో చూడని సెంటిమెంట్ సీన్ ఇది!
ఏ రాజకీయ వేత్త కు ఎదురై ఉండని అరుదైన అనుభవం !
డిల్లీ కి రాజైనా ఓ అమ్మకు బిడ్డే అదే రీతిలో ఎంతటి అధినాయకుడైనా ఆయన ఓ బిడ్డ కు తండ్రే ! ఆ తండ్రి మరెవరో కాదు కరుణా నిధి !ఆయనకు ఎదురైన అనుభవం ఇది !
2జీ స్పెక్ట్రమ్ కేసులో జైలుపాలైన తన కూతురు, డీఎంకే ఎంపీ కనిమొళిని ఆ పార్టీ చీఫ్, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సోమవారమిక్కడి తీహార్ జైల్లో కలుసుకుని ఓదార్చారు. డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ కార్యాలయంలో వీరు అరగంట పాటు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు చూసుకోగానే ఉద్విగ్నతకు లోనయ్యారు. ఒక దశలో కంటతడి కూడా పెట్టుకున్నారని తెలుస్తోంది. కనిమొళి తన జైలు అనుభవాలను తండ్రితో చెప్పుకుని బాధపడినట్లు సమాచారం. కూతురి కష్టాలు విన్న కరుణ ఆవేదన వ్యక్తం చేసినట్లు డీఎంకే వర్గాలు చెప్పాయి. డీఎంకే చీఫ్ సాయంత్రం 5.30 గంటలకు జైలుకు వచ్చారు. 87 ఏళ్ల కరుణ వయసును దృష్టిలో ఉంచుకుని జైలు సిబ్బంది ఆయన కారును కనిమొళి ఉన్న ఆరో నంబర్ జైలు గేటు వరకు అనుమతించారు. ఆయన వెంట భార్య, కనిమొళి తల్లి రాజాత్తి అమ్మాళ్, భర్త అరవిందన్, కొడుకు ఆదిత్య, డీఎంకే నేత టీఆర్ బాలు, ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు వచ్చారు. కరుణ, రాజాత్తి, అరవిందన్, ఆదిత్యలు మాత్రమే సూపరింటెండెంట్ కార్యాలయంలో కనిమొళితో మాట్లాడారు. మిగిలినవారు జైలు ఆవరణలో ఉండిపోయారు. కూతుర్ని చూసి రాజాత్తి విలపించినట్లు తెలుస్తోంది. కరుణ కుటుంబసభ్యులకు టీ ఇచ్చామని, అయితే వారి సమావేశాన్ని తాము పర్యవేక్షించలేదని తీహార్ జైలు అధికారి నీరజ్ కుమార్ తెలిపారు.

No comments:
Post a Comment