skip to main |
skip to sidebar
యువతలో ఉండే గందరగోళం...
సిద్దార్థ్, శృతిహాసన్ జంటగా వేణు శ్రీరామ్ దర్శకుడిగా
శ్రీవెంకటేశ్వరా ఫిలింస్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఓ మై
ఫ్రెండ్'. నవంబర్‌లో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. 'చిత్ర
దర్శకుడు 'ఆర్య' సినిమా నుంచి మా బ్యానర్‌లో పనిచేస్తున్నాడు. అతను చెప్పిన
కథ బాగా నచ్చింది. 'బొమ్మరిలు'్ల తర్వాత సిద్ధార్థ్ మా బ్యానర్‌లో
నటిస్తున్నాడు. సినిమాలోని పాత్రలను యువతరం తమవిగా భావిస్తారు. హన్సిక,
నవదీప్, శృతిహాసన్ తదితరులంతా చాలా బాగా చేశారు. స్నేహం-ప్రేమ విషయంలో
యువతరంలో ఉండే కన్‌ఫ్యూజన్ కథాంశంగా తెరకెక్కింది. ఆడియో వచ్చేనెలలో
విడుదల చేసి నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం. ప్రస్తుతం ఈ సినిమా
నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి' అని చెప్పారు.
No comments:
Post a Comment