Oct 4, 2011

' ది బిజినెస్ మేన్ '

http://icdn1.indiaglitz.com/telugu/wallpaper/ACTOR/maheshbabu/MaheshBabu_230107_1024_01.jpg
సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ల 'పోకిరి' కాంబినేషన్‌లో ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై అగ్రనిర్మాత వెంకట్‌ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీకి ' ది బిజినెస్‌ మేన్‌' టైటిల్‌ పెట్టారు. 'బిజినెస్‌ మేన్‌'గా సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఇంతకుముందు పోషించని పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ చెప్పిన బిజినెస్‌ మేన్‌ స్క్రిప్ట్‌ అద్భు తంగా వుందని మహేష్‌ చెప్పారు. 'గన్స్‌ డోన్ట్‌ నీడ్‌ అగ్రిమెంట్స్‌' అనే క్యాప్షన్‌తో పూరి జగన్నాథ్‌ ఈ చిత్రానికి ఓ స్పెషల్‌ క్రేజ్‌ తీసుకొచ్చారు. ఈ క్యాష్షన్‌ని బట్టి ఈ సినిమా కథ ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లో ఇది మరో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని డాషింగ్‌ డైరక్టర్‌ పూరి జగన్నాథ్‌ చెప్పారు. మేలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ చిత్రం సబ్జెక్ట్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. మహేష్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ' ది బిజినెస్‌ మేన్‌' తెలుగు చలనచిత్ర రంగంలో వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందని నిర్మాత వెంకట్‌ చెప్పారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు అతి త్వరలోనే !

No comments: