skip to main |
skip to sidebar
డిసెంబరులో పవన్ ‘ పంజా ’ !
పవన్‌కళ్యాణ్,
విష్ణువర్థన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘పంజా’ అనే టైటిల్‌ని
నిర్ణయించారు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియావర్క్స్ సంయుక్త నిర్మాణంలో
నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు
పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు
తెలియజేస్తూ ‘ పవన్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ‘పంజా’ అనే
పవర్‌ఫుల్ టైటిల్‌ని నిర్ణయించాం. కలకత్తా నేపథ్యంలో సాగే స్టయిలిష్
యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. తమిళంలో స్టయిలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న
విష్ణువర్థన్ ఈ సినిమాని న్యూలుక్‌తో ప్రెజెంట్ చేశారు. ఈనెల 10 నుంచి
బ్యాలెన్స్ పాటలను చిత్రీకరిస్తాం.దీపావళికి ఫస్ట్ ట్రైలర్‌ను విడుదల చేసి
నవంబరులో ఆడియోను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. తమిళంలో కూడా
‘పంజా’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సారాజేన్
డయాస్, అంజిలీ లావానియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే:
రాహుల్ కోడా, సంగీతం: యువన్‌శంకర్ రాజా, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్:
శ్రీకర్ ప్రసాద్, కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు.
No comments:
Post a Comment