జగన్ బాబు గారు
సాక్షి లో ఏంటండీ ఆ రాతలు? చంద్ర బాబు విపక్ష నేత అన్న గౌరవం కూడా లేదామీకు ?
మా బాబు ఎక్కడి కెళితే మీ కెందుకండీ ?? అయన సింగపూర్ వెళ్తే మీకెందుకు ??మాల్దీవులు వెళితే మీకెందుకు ? ? నిన్న మొన్నటి దాక అసెంబ్లీ లో ప్రజా సమస్యలపై పోరాడి అలసి పోయారు , అవినీతి పై అనర్ఘళం గా మాట్లాడి సోలసిపోయారు.తిమ్మిని బమ్మిని చేసే మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహరచన చేసి ఎమ్మెల్సీలను గెలిపించారు.ఇంతా చేసి
ఏదో నాల్గురోజులు విశ్రాంతి కోసం సింగపూర్ వెళితే ఆ రాతలు ఏందండీ??
హవాలా వీరుడు హసన్ అలీ ఏదో అవాకులు చవాకులు పేలితే మా బాబు గారికి అయన గారికి లింక్ కట్టేస్తారా ??విశ్రాంతి కోసం వెళితే హవాలా వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకే అంటారా ?? అయినా మా బాబు గారికి ఒక్క అలీ తోనే కాదు వందమంది తో సంబంధాలు వుంటాయి ,లావా దేవీలు వుంటాయి,మీకెందుకండీ ??అన్నింట్లో మా బాబు ముందు వుంటారు,మీకేమైనా అభ్యంతరమా??? మా బాబు గురించి అనుచర గణం ఏమి అనుకుంటే మీకేంటీ ?
మేము ఉత్తుత్తి కే ఏదో అంటే మసాలా పెట్టి వార్తలు రాస్తారా ?? కృష్ణా జిల్లా
టీడీపీ లో ముసలం అని టీవీ లో హోరేత్తిస్తారా?? అక్కడ ఏమి జరిగిందో మీకు తెల్సా ?? మీకెంత కుళ్ళు అండీ?? బాబు గారిని కనీసం విశ్రాంతి కూడా తీసుకోనివ్వరా ??కానివ్వండి!
బాబు గారు రానివ్వండి ! మేము మీ సంగతి చూస్తాం.ఉప ఎన్నికలు అయ్యాక మీరు కూడా విదేశాలకు వెళ్ళరా?? విశ్రాంతి తీసుకొరా???
మీరు రాసినట్టు మేమేమి మల్లగుల్లాలు పడటం లేదు కాకపోతే కాసింత కలవరపడ్డాం,చెవులు కొరుక్కున్నాం అంతే! ఆ మాత్రానికే వార్త రాసేస్తారా ?
మీరు వెంటనే ఖండన వార్త రాస్తే సరి లేదంటే మీ గురించి కూడా చెవులు కోరుక్కుంటాం
జాగ్రత్త మరి
ఇట్లు
బాబు గారి వీరాభిమానులు

No comments:
Post a Comment