సెప్టెంబర్
24, 2011లో భూమిపై పడిపోయిన 'పై వాతావరణ పరిశోధన ఉపగ్రహాన్ని (అప్పర్
అట్మాస్పియర్ రీసెర్చి శాటిలైట్)' 1991, సెప్టెంబర్ 15న అమెరికా
ప్రయోగించింది. ముఖ్యంగా భూమికి రక్షణ కవచంగా ఉంటున్న ఓజోన్ పొర మార్పులను
అధ్యయనం చేయడానికి, వాతావరణంలో జరుగుతున్న ఇతర మార్పులను గమనించడానికి ఈ
ఉపగ్రహం ప్రయోగించబడింది. దీని బరువు 5,900 కిలోగ్రాములు. ఇది 'స్పేస్
షెటిల్ డిస్కవరీ' ద్వారా ప్రయోగించబడింది. భూమిపై 600 కిలోమీటర్ల ఎత్తున
ఉంటూ భూకక్ష్యకు 57 డిగ్రీలతో తిరుగుతూ ఈ పరిశోధన ఉపగ్రహం పనిచేసింది.
మొదట
ఈ ఉపగ్రహం మూడేళ్ల అధ్యయనానికి మాత్రమే ఉద్దేశించబడింది. కానీ, 14
సంవత్సరాల తర్వాత కూడా దానిలోని 10 పరికరాలలో ఆరు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ
నేపథ్యంలో 2005, డిసెంబర్లోనే దీని వినియోగం నిలిపివేయబడింది.
అయినప్పటికీ, 2010- అక్టోబర్ 26న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం
వ్యర్థాలను తప్పించుకొనటంలో ఈ ఉపగ్రహంతో కొన్ని ప్రయోగాలను చేసింది. ఈ
ఉపగ్రహమే ఈ సంవత్సరం, సెప్టెంబర్ 24న ఫసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది.
No comments:
Post a Comment