చాలామంది డిజిటల్ కెమెరా, ఇంటర్నెట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే వందల కొద్దీ ఇమేజ్ లను హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఆయా ఫైళ్లు DSC0001, DSC0002 వంటి పేర్లతో డిజిటల్ కెమెరా నుండి పిసిలోకి బదిలీ చెయ్యబడతాయి. మరోమారు ఎప్పుడైనా మరికొన్ని ఫొటోల్ని కెమెరాలో నుండి ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మళ్లీ అవే డీఫాల్ట్ పేర్లను కెమెరా వాడుతుంది కాబట్టి, పిసిలో ఇప్పటికే ఆ పేరుతో వేరే ఫైల్ ఉందని ఓవర్ రైట్ చెయ్యమంటారా అని మెసేజ్ లు విసిగిస్తుంటుంది. దీనికి ఒకటే పరిష్కారం.. గతంలో కెమెరా నుండి, వెబ్ సైట్ల నుండి డౌన్ లోడ్ చేసుకుని స్టోర్ చెయ్యబడి ఉన్న ఇమేజ్ లన్నింటినీ ఒక క్రమపద్ధతిలో రీనేమ్ చేసుకోవడం! దీనివల్ల కొత్త ఫైళ్లని డౌన్ లోడ్/ట్రాన్స్ ఫర్ చేసుకునేటప్పుడు ఇప్పటికే ఆ పేరుతో ఫైల్ ఉంది అనే మాదిరి సమస్యలు తలెత్తవు. ఎలాంటి ఇతర సాఫ్ట్ వేర్ అవసరం లేకుండానే విండోస్ లో భారీ సంఖ్యలో ఉన్న ఫైళ్లని ఒక్క దెబ్బతో రీనేమ్ చేసుకునే అవకాశముంది. మీరు ఏ ఫోల్డర్ లో ఉన్న ఫైళ్లనైతే రీనేమ్ చెయ్యదలుచుకున్నారో ఆ ఫోల్డర్ లోకి వెళ్లి Ctrl+A కీబోర్డ్ షార్ట్ కట్ ద్వారా అన్ని ఫైళ్లనీ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు File మెనూలో ఉండే Rename అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. వెంటనే కేవలం ఆ ఫోల్డర్ లోని మొదటి ఫైల్ దగ్గర రీనేమ్ చెయ్యడానికి సిద్ధంగా కర్సర్ లభిస్తుంది. ఆ మొదటి ఫైల్/ఫోల్డర్ కి ఉదా.కు.. image అనే పేరుని ఇస్తే ఆ ఫోల్డర్ లో ఉన్న మిగిలిన ఫైళ్లు పై చిత్రంలోని విధంగా ఆటోమేటిక్ గా image (1), image (2).. ఇలా రీనేమ్ చెయ్యబడతాయి. శ్రమ తగ్గుతుంది.

Sep 3, 2011
ఎలాంటి సాఫ్ట్ వేర్ పనిలేకుండా వందలాది ఫైళ్లు ఒకేసారి రీనేమ్ !
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment