skip to main |
skip to sidebar
27 నుంచే దసరా సెలవులు
- షెడ్యూల్ ప్రకారమే ఇవ్వాలని సర్కారు నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు షెడ్యూల్ ప్రకారమే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావిషయక క్యాలెండర్‌లో రూపొందించిన విధంగా ఈనెల 27 నుంచి 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం జిల్లా విద్యాశాఖాధికారు (డిఇవో)లకు బుధవారం సర్క్యులర్ జారీ చేసింది. దసరా సెలవులు 22 నుంచి కాదని, ఈనెల 27 నుంచి వచ్చేనెల 9వ తేదీ వరకు ఉంటాయని సర్క్యులర్‌లో పొందుపరిచినట్లు సమాచారం. సకల జనుల సమ్మెను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవు లు ఈనెల 22 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోందని మంగళ వారం విశ్వసనీయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని దినపత్రికల్లోనూ ప్రముఖంగా ప్రచురణ అయ్యింది. దసరా సెలవులు షెడ్యూల్ ప్రకారమే ఇవ్వాలని స్పష్టం చేసింది. తెలంగాణలో ఉద్యోగులు ఈనెల 13 నుంచి సకల జనుల సమ్మెను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయులు ఈనెల 16 నుంచి నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. దీంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఈనెల 19 నుంచి 26 వరకు జరగాల్సిన త్రైమాసిక పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఉపాధ్యాయుల సమ్మెను ఎదుర్కొనేందుకు ఈనెల 22 నుంచే దసరా సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచించినప్పటికి, ఆ తరువాత వెనక్కి తగ్గింది.
No comments:
Post a Comment