Aug 29, 2011

నిజమైన లీడర్

శేఖర్  కమ్ముల  సినిమా  ‘లీడర్ ’గుర్తుందా ..అచ్చు  అలాగే ఉంది  మన    దేశంలో  జరిగిన   పరిణామాలు .ఒక  బిల్ తో  అందరిని  అవినీతిని   కట్టడి  చేయాలి  అని  సి .ఎం  అనుకుంటాడు . అదే  ‘లోక్పాల్ ’ఇక్కడ .దానికోసం  అసెంబ్లీలో  ఎవరూ  ఒప్పుకోరు ,ఇక్కడ  పార్లమెంట్ లో  అదే  సీన్ .దాని  కోసం  కొన్ని  మార్పులు  చేస్తారు  సినిమాలో.ఇక్కడ అసలు వాటిని పక్కన  పెట్టి 'ఉత్తుతి బిల్' ఆమోదించారు ప్రభుత్వ పెద్దలు
కానీ  ఇక్కడ  ‘లీడర్ ’అనే  పదానికి  వన్నె తెచ్చిన  "అన్నాజీ" తోడయ్యాడు .దేశానికీ  పట్టిన  అవినీతి  పారత్రోలడానికి ఆయన  చిన్న  జ్యోతి  వెలిగిస్తే  అది  దేశాన్ని  తాకింది , అందరూ  ఏకం  అయ్యారు ,ఆయనకి మద్దతు ఇచ్చారు .అతని నిరహరదీక్షకి ప్రబుత్వం  దిగివచ్చింది .
అలుపుఎరుగని  పోరాటం  చేసాడు .విజాయాన్ని  సాదించాడు .అంత  చేసినా  ఇది " ప్రజల  విజయం " అని  వినమ్రంగా  చెప్పాడంటే  అతని  యొక్క  గొప్పతనం  మనం  తెలుసుకోవచ్చు .ఈ  రోజుల్లో  పేపర్ లో ఫోటో  కోసం ,పేరు  కోసం  నానా  గడ్డి  తినే  నాయకులూ  ఉన్నారు ,చిన్న విజయం  వచ్చినా అది వాళ్ళ వల్లె సాదించాం  అని గొప్పలు పోతారు , కానీ  నిజమైన లీడర్   "అన్నా"  లానే  ఉంటారు …

No comments: