మహేష్‌బాబు అభిమానులతో పాటు ఎంతోమంది తెలుగుసినిమా ప్రేక్షకులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న చిత్రం “దూకుడు”. త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్ లో విడుదలైన “ఖలేజా” చిత్రం కమర్షియల్ గా హిట్ సాధించినప్పటికీ మహేష్‌బాబు చేసిన కొత్త నటన విపరీతంగా ఆకట్టుకొంది.
దూకుడు సినిమా దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమాలలో డ్రామాను కథనంలో కలిపి కథ నడిపే తీరు అమోఘం. పట్టుకోల్పోకుండా డ్రామా ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ పండించడంలో ఈయన పెద్దదిట్ట అని చెప్పవచ్చు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు.
ఈ సినిమాలో మహేష్‌బాబు పోలిస్‌గా నటిస్తున్నాడని కొన్ని వార్తలు, దొంగగా నటిస్తున్నాడని కొన్ని వార్తలు రావడం జరిగింది. ఆ వార్తలలో ఎంత నిజం వుందో తెలియదు కాని, ఈ సినిమాలో కొంత సేపు సినిమా డైరక్టర్‌గా నటిస్తున్నాడని తెలిసింది. శ్రీను వైట్ల సినిమాలన్నీ డ్రామాతోనే సాగుతాయి, అటువంటి డ్రామాలోనే సినిమా డైరక్టర్‌గా ఒక భాగమని ఊహ.
తెలంగాన ఏర్పాటుపై నడుస్తున్న నేటి రాజకీయాలు తెలుగుసినిమాలను చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయడం వలన, ప్రస్తుతం ఏ సినిమా కూడా మగధీర రికార్డ్స్ టచ్ చేయడం అసాధ్యం. పోకిరి సినిమాను బ్రేక్ చేసి మహేష్‌బాబు కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందెమో చూడాలి.




No comments:
Post a Comment